VZM: గుర్లలో డయేరియా ప్రస్తుతం అదుపులోకి వచ్చిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. భూగర్భ జలాలు కలుషితం కావటంతో అతిసారం విజృంభించిందని ఆదివారం మీడియాకు తెలిపారు. మృతులలో ఒకరికి మాత్రమే డయేరియా ఉన్నట్లు వైద్యులు తెలిపారని,వైద్య కళాశాల బృందం వచ్చిందని, క్లోరినేషన్ సాగుతోందన్నారు. గత వైసిపి ప్రభుత్వ తప్పిదాలే ఈ దుస్థితికి కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.