GNTR: ఉండవల్లిలోని మంత్రి నారా లోకేష్ నివాసంలో బుధవారం 42వ రోజు నిర్వహించిన ప్రజాదర్బార్‌కు మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తరలివచ్చారు. మంత్రి నారా లోకేష్‌ను స్వయంగా కలిసి తమ సమస్యలను విన్నవించారు. ప్రజా విజ్ఞప్తులను పరిశీలించిన మంత్రి.. ఆయా విన్నపాల పరిష్కారం కోసం అప్పటికప్పుడే సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.