తూ.గో: ఆరోగ్య పరిరక్షణ, ప్రకృతి పరిరక్షణే ధ్యేయంగా స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తిలో సఫాయి మిత్రా సురక్ష శిబిరంలో భాగంగా నియోజకవర్గంలోని పారిశుద్ధ్య కార్మికుల కోసం ఏర్పాటుచేసిన మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే సోమవారం ప్రారంభించారు. పారిశుధ్య కార్మికుల త్యాగం మరువలేనిదని ఎమ్మెల్యే అన్నారు.