సత్యసాయి: జిల్లాలో వివిధ అంగన్వాడీ కేంద్రాలలో పోస్టుల భర్తీ కోసం పారదర్శకంగా మౌఖిక పరీక్షలు నిర్వహించామని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ పేర్కొన్నారు. ధర్మవరం, హిందూపురం బాల సదన్లలో గల 12 వివిధ పోస్టులకు గురువారం ఐసీడీఎస్ కార్యాలయంలో మౌఖిక పరీక్ష నిర్వహించారు. 12 పోస్టులకు 50 దరఖాస్తులు వచ్చాయని, మౌఖిక పరీక్షలకు 29 మంది హాజరయ్యారని అన్నారు.