VSP: ప్రజా జాతీయ అర్బన్ కన్వెన్షన్–2024 సదస్సుకు విశాఖ మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్లకు ఆహ్వానం అందింది. ఈమేరకు మేయర్ హరివెంకట కుమారి ఓ ప్రకటనలో సోమవారం తెలిపారు. దేశంలో వివిధ నగరాల్లో జీవన నాణ్యతను ప్రమాణాలు మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన విధివిధానలకు ఈ సదస్సులో చర్చించనున్నారు. ఈ నెల 26న ఢిల్లీ వేదికగా జరగనుంది.