SKLM: శ్రీకాకుళం జిల్లా మండల కేంద్రం సార్వకోట ప్రధాన రహదారి పక్కన వెలసిన దుర్గ భవాని నవరాత్రి ఉత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవ విగ్రహాన్ని గ్రామ పురవీధుల్లో తిరువీధి ఉత్సవాలు నిర్వహించి, అనంతరం మండపంలో ఉన్న దేవికి ప్రత్యేక పూజ నిర్వహించారు. పండితులు మామిడి సంతోష్ శర్మ ఆధ్వర్యంలో పూజలు జరిగాయి.