KRNL: గ్రామాల అభివృద్ధి కోసం ఎన్డీయే కూటమి కృషి చేస్తోందని జనసేన ఆస్పరి మండల ప్రధాన కార్యదర్శి తలారి హనుమేశ్ అన్నారు. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా ఆస్పరి మండలం హలిగేర గ్రామంలో రూ.5 లక్షలతో సీసీ రహదారి నిర్మాణానికి శనివారం భూమిపూజ నిర్వహించారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, ఎన్డీయే కూటమి నాయకులు పాల్గొన్నారు.