ELR: ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటు హక్కు నమోదు కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో చేపట్టాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో నియోజవర్గ పరిధిలోని అధికారులు, నాయకులతో ఓటు హక్కు నమోదుపై సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఓటు హక్కు నమోదుకు మూడు రోజులు మాత్రమే ఉండడం వల్ల అర్హత ఉన్న వారందరినీ నమోదు చేయాలన్నారు.