KRNL: ఈ నెల 25న కర్నూలు ఆదర్శ విద్యామందిర్ క్రీడా ప్రాంగణంలో ఉమ్మడి జిల్లా స్థాయి జూనియర్ కళాశాలల రగ్బీ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా రగ్బీ సంఘం అధ్యక్షుడు గుడిపల్లె సురేందర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. విజేతలకు కప్పులతో పాటు మెడల్స్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్-19 బాలికల రగ్బీ జట్టుకు ఎంపిక ఉంటుందని తెలిపారు.