కృష్ణా: కూటమి సర్కారు పాలనలో వందరోజులు పూర్తి చేసుకోవడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు, అభివృద్ధి కార్యక్రమాలు ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం ద్వారా తీసుకెళుతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా మూడోరోజు ఆదివారం పెడన పట్టణంలో పెడన శాసనసభ సభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ గడపగడపకి కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.