ASR: హుకుంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆదివారం ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు నిర్వహించారు. సందర్భంగా ప్రజలకు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకొని, ప్రజలకు అందుబాటులో ఉండాలని వైద్యులకు సూచించారు. అనంతరం చికిత్స పొందుతున్న రోగుల యోగక్షేమాలు అడిగి తెలుసుకొని , వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.