PLD: ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టర్ పి.అరుణ్ బాబు ఆదేశాలతో శుక్రవారం వారసత్వ నగరమైన అమరావతిలో హెరిటేజ్ వాక్, స్వచ్ఛతాహీ సేవా ర్యాలీ కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా సత్తెనపల్లి ఆర్డీవో మురళీకృష్ణ, అమరావతి నగర అభివృద్ధి కమిటీ ఛైర్మన్ జాస్తి వీరాంజనేయులు హాజరయ్యారు.