కడప: పులివెందులలో వేముల మండలం చాగలేరుకు చెందిన రామాంజనేయులుపై బుధవారం ఉదయం ఇద్దరు రాడ్లతో తలపై దాడి చేశారు. ఓ మహిళతో రామాంజనేయులు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఆమె కొడుకులు సందీప్, శివ నాగేంద్ర రామాంజనేయుని తీవ్రంగా గాయపరిచినట్లు సీఐ గంగనాథ్ తెలిపారు. క్షతగాత్రుడిని తిరుపతికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.