GNTR: మంగళగిరి పట్టణం నుంచి హైవేను కలుపుతూ.. కనెక్టివిటీ రహదారిని నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రధానంగా తెనాలి రోడ్డు ఇరుకుమయం కావడం వల్ల ట్రాఫిక్ కష్టాలు ప్రజలను వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళగిరి నుంచి ఎయిమ్స్ వైద్యశాల మెయిన్ గేట్ మీదుగా బ్రహ్మానందపురంను కలుపుతూ రహదారిని నిర్మిస్తే హైవేను సులువుగా చేరుకోవచ్చని పలువురు సూచిస్తున్నారు.