NLR: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సోమవారం ఇందుకూరుపేట మండలంలో పర్యటిస్తున్నట్లు ఆ పార్టీ కార్యాలయ ప్రతినిధులు పేర్కొన్నారు. సాయంత్రం 4 గంటలకు మండలంలోని నిడిముసిలి పంచాయితీ పరిధిలో మహాలక్ష్మమ్మ దేవాలయం వద్ద నిర్వహించే ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.