నెల్లూరు: జిల్లాలో నిమ్మకాయల ధరలు స్వల్పంగా తగ్గాయి. బస్తా (లూజు) గరిష్ఠ ధర రూ.8 వేలు ఉండగా, ప్రస్తుతం రూ.7 వేలు పలుకుతోందని వ్యాపారులు తెలిపారు. కిలో వంతున చూస్తే రూ.50 నుంచి రూ.90 వరకు పలుకుతున్నాయి. తోటల్లో కాయల దిగుబడి పూర్తిగా తగ్గడంతో శనివారం నిమ్మకాయలకు డిమాండ్ బాగా పెరిగింది. అయితే నాణ్యత లేకుండా వస్తున్న కాయలతో గరిష్ఠ ధర పతనమైంది.