CTR: ప్రభుత్వ కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కలెక్టరేట్ వివేకానంద భవన్లోని వివిధ సెక్షన్లను, సీపీఓ, జిల్లా పౌర సరఫరాల సంస్థ, ఎన్ఐసీ, డీఎం సివిల్ సప్లై కార్యాలయాలను పరిశీలించారు. పరిశుభ్రంగా ఉంచు కోవడంపై దృష్టి పెట్టాలని సిబ్బందికి సూచించారు.