KRNL: అదోనిలో భారీగా కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్నట్లు త్రీటౌన్ సీఐ రామలింగయ్య తెలిపారు. పోలీసుల వివరాల మేరకు.. ఆదోని పట్టణ శివారులోని రాంజల చెరువు సమీపంలో రూ. 2.04 లక్షల విలువ గల 52 కర్ణాటక టెట్రా బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ముగ్గురు వ్యక్తులని అందులో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.