»Vinarobhaagyamu Vishnu Katha Movie Trailer Release
Movie Trailer: ‘వినరో భాగ్యము విష్ణు కథ’ నుంచి మరో ట్రైలర్ రిలీజ్
"వినరో భాగ్యము విష్ణు కథ"(VinaroBhaagyamu Vishnu Katha) సినిమా తిరుపతి నేపథ్యానికి సంబంధించిన కథాంశంతో రూపొందుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ట్రైలర్(Movie Trailer) ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
తిరుపతి నేపథ్యంలో ఇప్పటి వరకూ చాలా సినిమాలు(Movies) విడుదలయ్యాయి. తాజాగా యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) ఇదే ప్రధానాంశంతో సినిమా చేస్తున్నారు. “వినరో భాగ్యము విష్ణు కథ”(VinaroBhaagyamu Vishnu Katha) సినిమా తిరుపతి నేపథ్యానికి సంబంధించిన కథాంశంతో రూపొందుతోంది. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram), కశ్మీర పరదేశి జంటగా నటిస్తున్నారు. ఈ మూవీని గీతా ఆర్ట్స్2(Geetha Arts2) బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు.
“వినరో భాగ్యము విష్ణు కథ”(VinaroBhaagyamu Vishnu Katha) సినిమా ద్వారా కిశోర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇంత వరకూ ఈ సినిమాకు సంబంధించి వరుస అప్ డేట్స్ వచ్చాయి. ఇదివరకే ట్రైలర్, టీజర్, సాంగ్స్ వంటివి రిలీజ్ అయ్యాయి. శివరాత్రి కానుకగా ఈ సినిమా ఫిబ్రవరి 18వ తేదిన విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ట్రైలర్(Movie Trailer) ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ప్రతి క్రిమినల్ కి ఒక వీక్ నెస్ ఉంటుందని కిరణ్ చెప్పే డైలాగ్ అందర్నీ ఆకట్టుకుంటుంది. యాక్షన్, ఎమోషన్ కి సంబంధించిన సీన్స్ ను కట్ చేసి ట్రైలర్(Trailer)గా విడుదల చేశారు.
ఈ సినిమాకు చైతన్ భరద్వాజ్ మ్యూజిక్(Music) అందించారు. ఈ మూవీలో ఆమని, శుభలేఖ సుధాకర్, మురళీ శర్మ, ఎల్బీ శ్రీరామ్ వంటివారు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. వరుస ఫ్లాపుల్లో ఉన్న కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) ఈ సినిమాతో అయినా విజయం సాధిస్తాడేమోననేది వేచి చూడాల్సిందే.