»Tejas Ahimsa Release Date Is Fixed But Will It Compete With Mass Raja
Teja’s ‘అహింస’ రిలీజ్ డేట్ ఫిక్స్.. కానీ మాస్ రాజాతో పోటీనా!
Teja : ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటి సినిమాలతో ఫ్లాప్ అందుకున్నప్పటికీ.. ధమాకా, వాల్తేరు వీరయ్యతో బ్యాక్ టు బ్యాక్ సాలిడ్ హిట్స్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు.
ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటి సినిమాలతో ఫ్లాప్ అందుకున్నప్పటికీ.. ధమాకా, వాల్తేరు వీరయ్యతో బ్యాక్ టు బ్యాక్ సాలిడ్ హిట్స్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘రావణాసుర’గా రాబోతున్నాడు. ఇందులో రవితేజ విలన్ షేడ్స్ ఉన్న రోల్ చేస్తున్నాడు. ఏప్రిల్ 7న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా రిలీజ్ చేసిన టీజర్.. సినిమా పై అంచనాలను పెంచేసింది. అయినా కూడా ఇద్దరు యంగ్ హీరోలు మాత్రం మాస్ రాజాతో పోటి పడేందుకు సై అంటున్నారు. అది కూడా ఓ డెబ్యూ హీరో రవితేజతో పోటీ అంటే.. రిస్క్ తప్పదనే చెప్పొచ్చు. రామానాయుడు మనవడు, సురేశ్ బాబు చిన్న కొడుకు, రానా తమ్మడు అభిరామ్‌ను.. దర్శకుడు తేజ ‘అహింస’ అనే సినిమాతో హీరోగా పరిచయం చేస్తున్నాడు. ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై పి. కిరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యి చాలా కాలమే అవుతోంది. కానీ రిలీజ్‌కు నోచుకోవడం లేదు. కానీ ఫైనల్‌గా ఏప్రిల్ 7వ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. దాంతో ‘అహింస’ బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీ తప్పేలా లేదు. ఎందుకంటే, ప్రస్తుతం తేజ ఫామ్‌లో లేడు.. అభిరాం కొత్త హీరో.. కాబట్టి ‘అహింస’కు రిస్క్ తప్పదనే చెప్పాలి. అదే రోజు కిరణ్ అబ్బవరం నటించిన ‘మీటర్’ కూడా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇటీవలె ‘వినరో భాగ్యము విష్ణు కథ’తో అలరించాడు కిరణ్. కాబట్టి.. రవితేజకు పోటీగా.. కిరణ్ అబ్బవరం, అభిరాం.. ఎంతవరకు నిలబడుతుందనేది ఆసక్తికరంగా మారింది. చూడాలి మరి!