»Recent Telugu Blockbuster Film Balagam Will Premiere On Amazon Prime And Simply South From March 24th At 12am
Balagam Movie: ఓటీటీలోకి ‘బలగం’..ఎప్పుడంటే
జబర్దస్త్ కమెడియన్ వేణు(Venu) డైరెక్టర్ గా మారి తీసిన మొదటి సినిమా బలగం(Balagam). కథనంలో కొత్తదనం ఉందని విమర్శకులు సైతం ప్రశంసలు అందిస్తున్నారు. థియేటర్లలో విడుదలైన ఈ సినిమా తాజాగా ఓటీటీ(OTT)లో రిలీజ్ అవ్వడానికి సిద్ధమైంది. అమెజాన్ ప్రైమ్(Amazon Prime) వీడియోతో పాటుగా సింప్లీ సౌత్ ఓటీటీ(OTT) ఫ్లాట్ ఫామ్స్ లో మార్చి 24 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
టాలీవుడ్(Tollywood)లో చిన్న సినిమాలకు ఆదరణ పెరుగుతోంది. మంచి కంటెంట్‌తో వచ్చే సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తూ విజయాన్ని అందిస్తున్నారు. తాజాగా తెలంగాణ(Telangana) మట్టి వాసన, పల్లె పరిమళంతో బలగం(Balagam) సినిమా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు మొదటి నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. దర్శకుడు వేణు(Director Venu) తెలంగాణ ప్రజల ఆత్మకు తెరరూపం ఇచ్చారనే ప్రశంసలు దక్కాయి. చిన్న సినిమాగా విడుదలై కలెక్షన్ల పరంగా మంచి విజయాన్ని(Hit) అందుకుంది.
జబర్దస్త్ కమెడియన్ వేణు(Venu) డైరెక్టర్ గా మారి తీసిన మొదటి సినిమా బలగం(Balagam). కథనంలో కొత్తదనం ఉందని విమర్శకులు సైతం ప్రశంసలు అందిస్తున్నారు. థియేటర్లలో విడుదలైన ఈ సినిమా తాజాగా ఓటీటీ(OTT)లో రిలీజ్ అవ్వడానికి సిద్ధమైంది. అమెజాన్ ప్రైమ్(Amazon Prime) వీడియోతో పాటుగా సింప్లీ సౌత్ ఓటీటీ(OTT) ఫ్లాట్ ఫామ్స్ లో మార్చి 24 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
బలగం(Balagam) సినిమాలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ వంటివారు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా విడుదలై 20 రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకూ రూ.20.5 కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసింది. ఈ మూవీకి 2.2 కోట్లలోపు బడ్జెట్ మాత్రమే పెట్టారు. నిర్మాత దిల్ రాజు(Dil Raju)కు ఈ సినిమా కాసుల వర్షం కురిపించింది. తెలంగాణ(Telangana) కల్చర్ కు ఈ మూవీలో ప్రాముఖ్యత ఇవ్వడంతో అందరూ ఈ సినిమాను ఆదరించి సక్సెస్(Success)ను అందించారు.