స్వల్నలోక్ ఫైర్ యాక్సిడెంట్(Swapnalok Fire Accident)పై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ramgopal varma) స్పందించారు. అగ్ని ప్రమాద ఘటన చాలా బాధాకరమన్నారు. ఆ కాంప్లెక్స్ గురించి పలు ఆసక్తికర విషయాలను తెలియజేశారు. తాను నాగార్జున(Nagarjuna)తో తీసిన శివ సినిమా క్లైమాక్స్(Shiva Movie Climax)ను స్వప్నలోక్ కాంప్లెక్స్ పైనే చిత్రీకరించినట్లు తెలిపారు. సినిమా చివరలో నాగార్జున, రఘువరన్ మధ్య వచ్చే ఫైటింగ్ సీన్స్ అంతా అక్కడే షూట్ చేసినట్లు ఆర్జీవీ(RGV) గుర్తు చేసుకున్నారు.
సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్(Swapnalok Complex)లో ఘోర అగ్నిప్రమాదం(Fire Accident) జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. మృతిచెందిన ఆ ఆరుగురికి పాతికేళ్లు కూడా నిండలేదు. అగ్ని ప్రమాద మృతుల కుటుంబాల్లో విషాదచాయలు అలముకున్నాయి. తమ బిడ్డల్ని తలచుకుని ఆ కుటుంబాలు తల్లడిల్లిపోతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్(CM KCR)తో పాటుగా పలువురు ప్రముఖులు స్వప్నలోక్ కాంప్లెక్స్(Swapnalok Complex) ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ స్పందిస్తున్నారు. అందరూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు.
రామ్ గోపాల్ వర్మ షేర్ చేసిన వీడియో:
This sequence in SHIVA was shot on top of Swapna lok complex which caught fire last nite https://t.co/TcaM5YQWS8
తాజాగా స్వల్నలోక్ ఫైర్ యాక్సిడెంట్(Swapnalok Fire Accident)పై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ramgopal varma) స్పందించారు. అగ్ని ప్రమాద ఘటన చాలా బాధాకరమన్నారు. ఆ కాంప్లెక్స్ గురించి పలు ఆసక్తికర విషయాలను తెలియజేశారు. తాను నాగార్జున(Nagarjuna)తో తీసిన శివ సినిమా క్లైమాక్స్(Shiva Movie Climax)ను స్వప్నలోక్ కాంప్లెక్స్ పైనే చిత్రీకరించినట్లు తెలిపారు. సినిమా చివరలో నాగార్జున, రఘువరన్ మధ్య వచ్చే ఫైటింగ్ సీన్స్ అంతా అక్కడే షూట్ చేసినట్లు ఆర్జీవీ(RGV) గుర్తు చేసుకున్నారు.
ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియోను వర్మ ట్వీట్(Varma Tweet) చేశారు. ఆ వీడియో కాస్తా వైరల్(Viral) అవుతోంది. అంతకుముందు స్వప్పలోక్ కాంప్లెక్స్(Swapnalok Complex)కు వెళ్లినట్లుగా మేయర్ విజయలక్ష్మి ట్వీట్(Mayor Vijayalakshmi Tweet) చేశారు. తాను రెస్క్యూ ఆపరేషన్స్ ని మానిటర్ చేస్తున్నట్లు ట్విట్టర్ లో తెలిపారు. మేయర్ చేసిన ట్వీట్ పై రామ్ గోపాల్ వర్మ(Ramgopal varma) ఘాటుగానే రియాక్ట్ అయ్యారు.
స్వప్నలోక్ కాంప్లెక్స్(Swapnalok Complex) వద్దకు కుక్కల్ని తీసుకెళ్లలేకపోయారా? అంటూ మేయర్ కు వర్మ(Varma) చురకలంటించాడు. ఈ ఘటనపై మరో కోణం కూడా హడలెత్తిస్తోంది. స్వప్నలోక్ కాంప్లెక్స్ లో మరణాల వెనక చైన్ మార్కెటింగ్ ఉందంటూ పలువురు చర్చించుకుంటున్నారు. లక్షలు కట్టించుకుని క్యూనెట్ పేరుతో కార్యకలాపాలు సాగిస్తున్నారని, ఇన్సూరెన్స్ కోసమే ప్రమాదాన్ని సృష్టించారని మృతుల కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం వర్మ ట్వీట్ వైరల్(Varma Tweet Viral) అవుతోంది.