»Bellam Konda Ganesh Clarity On Balakrishna Gun Firing
Bellamkonda Ganesh: బాలకృష్ణ కాల్పులపై బెల్లం కొండ గణేష్ క్లారిటీ!
టాలీవుడ్ నిర్మాత బెల్లంకొండ సురేష్ గురించి అందరికీ తెలిసిందే. ఒకప్పుడు టాప్ స్టార్స్‌తో సినిమాలు చేసిన బెల్లండ గత కొన్నాళ్లుగా సైలెంట్ అయిపోయారు. కానీ ఇద్దరు కొడుకులను హీరోలుగా నిలబెట్టేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. ప్రస్తుతం బెల్లంకొండ చిన్న కొడుకు బెల్లంకొండ గణేష్ 'నేను స్టూడెంట్ సార్' అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణ.. తన తండ్రి సురేష్‌పై కాల్పులు జరిపిన ఘటనపై స్పందించాడు.
బెల్లంకొండ గణేష్ హీరోగా, రాఖీ ఉప్పలపాటి దర్శకత్వంలో ‘నేను స్టూడెంట్ సార్’ సినిమా తెరకెక్కింది. ఎస్వీ 2 ఎంటర్టైన్మెంట్ పతాకంపై సతీష్‌వర్మ నిర్మిస్తున్నారు. జూన్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. స్వాతి ముత్యం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. పర్వాలేదనిపించుకున్న గణేష్.. ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకోవాలని చూస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. అందులోభాగంగా.. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హీరో బాలకృష్ణ తన తండ్రి సురేష్‌పై కాల్పులు జరిపిన ఘటనపై స్పందించారు.
2004లో నిర్మాత బెల్లం కొండ సురేష్‌తో పాటు మరో వ్యక్తిపై.. తన ఇంట్లోనే గన్‌తో కాల్పులు జరిపారు బాలకృష్ణ. లక్ష్మీ నరసింహ సినిమా రిలీజ్ తర్వాత జరిగిన ఈ వివాదం.. అప్పట్లో సంచలనంగా నిలిచింది. అయితే అసలు బాలయ్య, బెల్లంకొండను ఎందుకు కాల్చాడనేది.. ఇప్పటికీ ఎవరికీ సరిగ్గా తెలియదు. ఇదే విషయాన్ని బెల్లం కొండ గణేష్‌ను అడగ్గా.. ‘కాల్పుల సంఘటన జరిగినప్పుడు నాకు పదేళ్లు కూడా లేవు.. అసలు ఏం జరిగిందో కూడా నాకు ఐడియా లేదు. ఆ ఇన్సిడెంట్ గురించి నేను, మా ఫ్యామిలీ మెంబర్స్ మా నాన్నతో మాట్లాడలేదు. ఇప్పుడు దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని’ అన్నారు. దీంతో పాటు ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు గణేష్ బాబు. అయినా కూడా బాలయ్య ఫైరింగ్ కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. మరి ఈ సినిమాతో బెల్లంకొండ గణేష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.