Realme 12+ 5G launch :ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ రియల్మీ తమ రియల్మీ 12+ 5జీ (Realme 12+ 5G) స్మార్ట్ ఫోన్‌ని మన దేశంలో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ విషయాన్ని సంస్థ వెల్లడించింది. దీని డిజైన్‌కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా ఆన్‌లైన్‌లోకి లీకయ్యాయి. ఆ వివరాలేంటో తెలుసుకుందామా మరి.
ఇప్పటి వరకు అందుబాటులోకి వచ్చిన ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి. రియల్మీ 12+ 5జీ స్మార్ట్ ఫోన్‌కి లెథర్ టెక్స్చర్తో కూడాని బ్యాక్ ప్యానల్ ఉంటుంది. దీంతో ఇది చూసేందుకు ప్రీమియంగా ఉంటుంది. ఇది రియల్మీ 12ని పోలి ఉండే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. అలాగే రియల్మీ 12 ప్లస్ 5జీలో 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.67 ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. 50ఎంపీ ప్రైమరీతో కూడిన ట్రిపుల్ రేరే కెమెరా సెటప్ ఉంది.
ఇక ఈ మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లో డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ ఉంటుంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ దీనికి లభిస్తుంది. 6జీబీ, 8జీబీ, 12జీబీ, 16జీబీ ర్యామ్ వేరియంట్లలో ఇది అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ల వివరాలు మాత్రమే ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. అధికారికంగా వీటి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. మిడ్ రేంజ్ గ్యాడ్జెట్లలో ఇప్పటికే గట్టి పోటీ ఉంది. అందుకే రియల్మీ 12 ప్లస్ ప్రైజింగ్ చాలా కీలకంగా ఉంటుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.