CM Arvind Kejriwal's party called AAP against the BJP saying that farmers are being detained in jail
FarmersProtest2024: రైతుల ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని అడ్డుకున్న నరేంద్ర మోడీ సర్కార్‌పై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సారధ్యంలోని ఆప్ విరుచుకుపడింది. అన్నదాతలను జైల్లో నిర్బంధించడం తప్పని పేర్కొంది. రైతుల ఆందోళన కార్యక్రమం నేపథ్యంలో ఢిల్లీలోని బవానా స్టేడియంను జైలుగా మార్చారని, ఇది ప్రజా వ్యతిరేకమని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండిస్తున్నట్లు ఆప్ ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఫిబ్రవరి 13న రైతుల మార్చ్ నేపధ్యంలో నిరసనకారులను అదుపులోకి తీసుకోవాలని, బవానా స్టేడియాన్ని జైలుగా మార్చాలని కేంద్రం సోమవారం ఢిల్లీ ప్రభుత్వానికి లేఖ రాసిందని ఆప్ పేర్కొంది. రైతుల డిమాండ్లు న్యాయమైనవని, రాజ్యాంగం ప్రకారం శాంతియుత నిరసనలు చేపట్టడం ప్రతి పౌరుడి హక్కని ప్రకటనలో ఆప్ తెలిపింది. రైతులు ఈ దేశానికి అన్నం పెడుతున్నారని, వారిని జైల్లో పెట్టడం తప్పని పేర్కొంది. ఇక పంజాబ్ నుంచి దేశ రాజధానికి రైతులు తరలివస్తుండటంతో వారిని అడ్డకునేందుకు నగరవ్యాప్తంగా వివిధ అంచెల్లో భద్రతా ఏర్పాట్లు చేయడం, ఢిల్లీ సరిహద్దుల్లో పెద్దసంఖ్యలో బారికేడ్లు, ఇనుప కంచెలు, కంటెయినర్ వాల్స్ ఏర్పాటు చేయడంపై ఆప్ ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వం, రైతు సంఘాల నేతల మధ్య చర్చలు విఫలం కావడంతో రైతుల సంఘాలు 13న ఛలో ఢిల్లీ పిలుపు ఇచ్చారు.
❌ Kejriwal Govt. Turns down Central Govt.'s proposal to convert Bawana Stadium into a Temporary Jail for farmers. ❌
▪️The demands of the farmers are genuine. ▪️It is the constitutional right of every citizen to protest peacefully. ▪️Farmers are our 'annadatas' ▪️Central Govt.… pic.twitter.com/b9vYNRSuOc