Train tickets for train halting : అది ఓ చిన్న రైల్వే స్టేషన్. అక్కడ ఆ ఊరి వారు రోజూ దాదాపుగా 60 వరకు టికెట్లు కొంటారు. కానీ ఎవరూ ప్రయాణం చేయరు. ఊరికే ఇలా ఎందుకు టికెట్లు కొంటారు? అనేది ఆసక్తికరమైన విషయం. వివరాల్లోకి వెళితే…
అది తెలంగాణలోని నెక్కొండ గ్రామం. ఆ ఊరి రైల్వే స్టేషన్(Train Station)లో రోజో కొద్దో కొప్పో రైళ్లు రోజూ ఆగుతూ ఉండేవి. ఆ చుట్టుపక్కల గ్రామాల నుంచి రైలు ఎక్కడానికి ప్రజలు అక్కడికి తరలి వస్తుంటారు. అయితే ప్రయాణికులు పెద్దగా లేరనే కారణం చూపి రైల్వే అధికారులు ఆ స్టేషన్లో కొన్ని రైళ్ల హాల్టింగ్(Train Halting)ని ఆపేశారు. తిరుపతి, హైదరాబాద్, దిల్లీ, షిరిడీ లాంటి ముఖ్య ప్రాంతాలకు వెళ్లే రైళ్లకు ఇక్కడ హాల్టింగ్ లేకుండా పోయింది. ఆదాయం తగ్గుతుందని చెబుతూ రైల్వే అధికారులు పద్మావతి ఎక్స్‌ప్రెస్ తిరుగు ప్రయాణంలో ఆ రైల్వే స్టేషన్‌కు హాల్టింగ్ని రద్దు చేశారు. అయితే తమ స్టేషన్‌కు హాల్టింగ్ కల్పించాలంటూ ప్రయాణికులు కోరారు. దీంతో మూడు నెలల పాటు ఆదాయం వస్తేనే పూర్తి స్థాయిలో హాల్టింగ్ ఇస్తామని రైల్వే అధికారులు చెప్పారు.
దీంతో తమ స్టేషన్‌కు హాల్టింగ్ కోల్పోకూడదని అక్కడి స్థానికులంతా ఒక్కటయ్యారు. ‘నెక్కొండ పట్టణ రైల్వే టికెట్స్ ఫోరం’ అని ఓ వాట్సాప్ గ్రూప్‌ని క్రియేట్ చేశారు. దాని ద్వారా స్థానికులు, వ్యాపారుల నుంచి డబ్బులు విరాళాలుగా సేకరించారు.ఈ గ్రూపులో దాదాపుగా 400 మంది సభ్యులున్నారు. వీరంతా కలిసి రోజూ దాదాపుగా 60కి పైగా టికెట్లు కొంటారు. ఇలా తమ స్టేషన్‌కి ఆదాయం చూపించడం కోసం వీరు ప్రయత్నిస్తున్నారు. ఇలా ఆదాయం వస్తే మన రైల్వే స్టేషన్‌కి మరిన్ని రైళ్ల హాల్టింగ్ లభిస్తుందని వీరు ఆశిస్తున్నారు. వీరు చేస్తున్న ప్రయత్నానికి చుట్టుపక్కల వారి నుంచీ ప్రోత్సాహం లభిస్తోంది.
Train Halting, Train, Train Station, Indian Railways, Nekkonda