NDL: శ్రీశైల మల్లికార్జున స్వామి వారి పరమ భక్తురాలు అక్కమహాదేవి జయంత్యోత్సవాన్ని రేపు నిర్వహించనున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. చైత్ర పౌర్ణమి పురస్కరించుకొని ఉ.9 గంటలకు అక్కమహాదేవికి ప్రత్యేక అభిషేకాలు, విశేషాలు నిర్వహించనున్నారు. 12 వ శతాబ్దానికి చెందిన అక్కమహాదేవి, కన్నడ శివశరణలలో ప్రసిద్ధ మహా భక్తురాలిగా వెలుగొందారు.