»Cameraman Gangatho Rambabu Re Release Of Pawans Movie As Election Target
Cameraman Gangatho Rambabu: ఎలక్షన్స్ టార్గెట్గా పవన్ సినిమా రీ రిలీజ్?
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్కు బ్రేక్ ఇచ్చి పాలిటిక్స్ పరంగా ఫుల్ బిజీగా ఉన్నారు. వచ్చే ఏపి ఎలక్షన్స్ టార్గెట్గా దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ నుంచి ఓ సినిమా రీ రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు.
Cameraman Gangatho Rambabu: రీ ఎంట్రీ తర్వాత పవన్ వరుస సినిమాలు కమిట్ అయ్యారు. ప్రస్తుతం పవన్ చేతిలో మూడు సినిమాలున్నాయి. ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సెట్స్ పై ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాల షూటింగ్ కంప్లీట్ కావాల్సి ఉండగా.. ఎలక్షన్స్ కారణంగా షూటింగ్కు బ్రేక్ ఇచ్చారు. ఏప్రిల్ నెలలో ఏపిలో అసెంబ్లీ ఎలక్షన్స్ జరగనున్నాయి. ఆ తర్వాత ఫస్ట్ ఓజి సినిమాకు డేట్స్ ఇవ్వనున్నారు పవన్. సెప్టెంబర్ 27న ఓజి రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు. అయితే.. ఎలక్షన్స్ టార్గెట్గా పవన్ నుంచి ఓ సినిమా రీ రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు. దాదాపు 12 ఏళ్ల క్రితం వచ్చిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రాన్ని రీ రిలీజ్ చేయడాని రెడీ అవుతున్నారు. పవన్ కళ్యాణ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా.. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా 2012వ సంవత్సరం అక్టోబర్లో రిలీజ్ అయింది. రాంబాబుగా పవన్ కళ్యాణ్, గంగ పాత్రలో తమన్నా నటించారు.
మెకానిక్ అయిన రాంబాబు సొసైటీలో జరిగే అరాచకాలను ఎలా ఎదుర్కొన్నాడు? అనే కథాంశంతో రూపొందిన ఈ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. దీంతో ఈ సినిమా రీ రిలీజ్కు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడే ఎందుకు కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు? అంటే, టార్గెట్ వచ్చే ఎలక్షన్స్ అంటున్నారు. త్వరలో జరగనున్న ఎలక్షన్స్ టార్గెట్గా ఫిబ్రవరి 7, 8 తేదీల్లో ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇలాంటి పొలిటికల్ హీట్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో రాంబాబు రీ రిలీజ్ పర్ఫెక్ట్ టైం అని అంటున్నారు.