టీడీపీ నేత, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలకు నుంచి తప్పుకుంటున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఇకనుంచి పూర్తిస్థాయి రాజకీయాల్లో కొనసాగనని స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లు గల్లా చెప్పారు.
Galla Jayadev: టీడీపీ నేత, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలకు నుంచి తప్పుకుంటున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఇకనుంచి పూర్తిస్థాయి రాజకీయాల్లో కొనసాగనని స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లు గల్లా చెప్పారు. రాజకీయాల్లో నా పని పూర్తిగా నిర్వర్తించలేక పోతున్నాననే భావన ఉందని, ప్రజల్లో ఎక్కువ సమయం ఉండలేక పోతున్నానని తెలిపారు. మళ్లీ నేను పోటీ చేస్తే గెలుస్తానని తెలిపారు. కానీ రాజకీయాల్లో ఉంటే వివాదాలు వస్తున్నాయని తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంతో ఇబ్బందులు.. మౌనంగా ఉండటం, పార్లమెంట్లో మౌనంగా కూర్చోవడం నావల్ల కాదని గల్లా పేర్కొన్నారు. రాజకీయం, వ్యాపారం రెండు చోట్ల ఉండలేను. రెండు చోట్ల ఉండలేనందునే రాజకీయం వదిలేశానని గల్లా స్పష్టం చేశారు. గుంటూరు ప్రజలు నాకు ఇంతకాలం రాజకీయంగా సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గెలుపోటములు సహజమని చెప్పిన గల్లా, వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని, ఆ తరువాత అవకాశం వస్తే తిరిగి పోటీ చేసే విషయంపై ఆలోచిస్తానని అన్నారు.
గల్లా జయదేవ్ టీడీపీ అభ్యర్థిగా గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు పోటీచేసి విజయంసాధించారు. అయితే, గతకొంతకాలంగా టీడీపీ కార్యక్రమాలకు గల్లా జయదేవ్ దూరంగా ఉంటూ వస్తున్నారు. మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి కుమారుడు గల్లా జయదేవ్. తల్లి తరువాత రాజకీయాల్లోకి వచ్చి, రెండు సార్లు ఎంపీగా విజయం సాధించారు. జయదేవ్‌కు అమరరాజా బ్యాటరీస్ కంపెనీ ఉంది. ఇతర వ్యాపారాలుకూడా ఉన్నాయి.