అసలు పుష్ప2 బడ్జెట్ ఎంత? అంటే, ఇండస్డ్రీ వర్గాల ప్రకారం ఓ ఫిగర్ ప్రచారంలో ఉంది. కానీ ఇప్పుడు ఆ ఫిగర్ డబుల్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి పుష్ప2 అసలు బడ్జెట్ ఎంత? ఇప్పుడు పెరిగిన బడ్జెట్ ఎంత?
Pushpa 2: పుష్ప పార్ట్ వన్‌కు వచ్చిన క్రేజ్‌తో.. దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో పుష్ప పార్ట్ 2 తెరకెక్కిస్తున్నారనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. అంతేకాదు.. సుకుమార్‌కు మైత్రీ మూవీ మేకర్స్ అన్‌లిమిటేడ్ బడ్జెట్ ఇచ్చినట్టుగా ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో పుష్ప2 బడ్జెట్ భారీగా పెరిగిపోయినట్టుగా తెలుస్తోంది. ముందుగా 350 కోట్లు అనుకున్నప్పటికీ.. ఇప్పుడు డబుల్ అయినట్టుగా తెలుస్తోంది. పుష్ప2కి సుమారు 500 నుంచి 600 కోట్ల వరకు ఖర్చు అవుతుందని టాక్ వినిపిస్తోంది. సుకుమార్ ఈ సినిమాను ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా షూట్ చేస్తున్నాడట. అసవరమైతే కొన్ని సీన్లను రీషూట్ కూడా చేస్తున్నాడట. దీంతో బడ్జెట్ డబుల్ అయిందనే మాట వినిపిస్తోంది.
ఇదే జరిగితే.. పుష్పరాజ్ టార్గెట్ వెయ్యి కోట్లు ఫిక్స్ అయినట్టే. బాలీవుడ్ ఆడియెన్స్ పుష్ప2 కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టే వేర్ ఈజ్ పుష్ప అంటూ.. ఓ వీడియోతో అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లాడు సుకుమార్. ఇక ఇప్పుడు ఏకంగా ఐదారు వందల కోట్ల బడ్జెట్ అంటున్నారు అంటే.. సుకుమార్ ఏ రేంజ్లో ప్లాన్ చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. అయితే పుష్ప2 బడ్జెట్ డబుల్ అనే మాటలో నిజం లేదని కొందరు అంటున్నారు.
ఒకవేళ పెరిగినా మరో 100 కోట్లకు అటు ఇటుగా పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. కానీ డబుల్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఇదిలా ఉంటే.. ఆగస్టు 15న పుష్ప2 రిలీజ్ చేసి తీరుతామని మరోసారి క్లారిటీ ఇచ్చారు మేకర్స్. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మరి పుష్ప2 ఎలా ఉంటుందో చూడాలి.