»Mahesh Babu Mahesh Babu Who Entered The Field For Rajamouli
Mahesh babu: రాజమౌళి కోసం రంగంలోకి దిగిన మహేష్ బాబు?
ప్రస్తుతం గుంటూరు కారం సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. డివైడ్ టాక్ వచ్చిన కూడా తగ్గేదేలే అంటోంది. దీంతో రాజమౌళి కోసం రంగంలోకి దిగిపోయాడు మహేష్ బాబు.
Mahesh babu: గుంటూరు కారం సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఉన్నట్టుండి పారిన్ ట్రిప్‌కి వెళ్లిపోయాడు. ఎప్పుడు ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళ్లే మహేష్.. ఈసారి మాత్రం ఒక్కడే జర్మనీకి ఫ్లైట్ ఎక్కేశాడు. దీంతో.. ఈ సోలో ట్రిప్ పై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈ ట్రిప్ వెనుక రాజమౌళి హ్యాండ్ ఉందని అంటున్నారు. గుంటూరు కారం సినిమానే తన లాస్ట్ రీజనల్ సినిమా అని రీసెంట్‌గానే చెప్పుకొచ్చాడు మహేష్. ఎందుకంటే.. నెక్ట్స్ నుంచి మహేష్ చేయబోయే సినిమాలన్నీ పాన్ ఇండియా, పాన్ వరల్డ్ రేంజ్‌లోనే రాబోతున్నాయి.
ఇప్పటి వరకు రీజనల్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన మహేష్.. ఎస్ఎస్ఎంబీ 29తో పాన్ ఇండియా ఎంట్రీ ఇస్తున్నాడు. ఒక్క పాన్ ఇండియా అనే కాదు.. రాజమౌళి ఈ సినిమాను హాలీవుడ్ లెవల్లో తెరకెక్కిస్తున్నాడు. దాదాపు వెయ్యి కోట్లు ఖర్చు చేస్తున్నట్టుగా టాక్ నడుస్తోంది. దీంతో గుంటూరు కారం పని అయిపోగానే.. ఇప్పుడు రాజమౌళి కోసం మహేష్ బాబు రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఎస్ఎస్ఎంబీ 29 వర్క్ స్టార్ట్ అయినట్లుగా సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసమే మహేష్ సోలోగా జర్మనీకి ట్రిప్ వేసాడని టాక్ నడుస్తోంది.
అక్కడ హాలీవుడ్ టెక్నీషియన్స్‌ను కలవడానికి వెళ్లినట్టు సమాచారం. మూడురోజుల పాటు మహేష్ జర్మనీలో ఉండబోతున్నాడట. ఆ తర్వాత ఇండియాకు తిరిగొచ్చి గుంటూరు కారం సక్సెస్ సెలబ్రేషన్స్‌లో పాల్గొంటాడని అంటున్నారు. మరి నిజంగానే మహేష్ ఎస్ఎస్ఎంబీ 29 కోసం విదేశాలకు వెళ్లాడా? లేదా వేరే కారణం ఉందా? అనేది తెలియాల్సి ఉంది.