Hamas: ఎక్స్ ఖాతాలపై బ్యాన్ చేసిన మస్క్.. కారణమిదే?
హమాస్‌కు సంబంధించి ఎక్స్ ఖాతాలను బ్యాన్ చేయాలన్న నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయం కఠినమైందని.. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో ఎలెన్ మస్క్ వివరించారు.
Hamas: హమాస్‌కు సంబంధించి ఎక్స్ ఖాతాలను బ్యాన్ చేయాలన్న నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయం కఠినమైందని.. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో ఎలెన్ మస్క్ వివరించారు. కస్సం2024 అనే ఖాతాకు సంబంధించి ఓ ప్రశ్న వచ్చింది. జాక్సన్ హింక్లె అనే యూజర్ పాలస్తీనా మిలిటెంట్ గ్రూపునకు చెందిన ఖాతాను ఎందుకు సస్పెండ్ చేశారని ప్రశ్నించారు. దీనికి మస్క్ స్పందిస్తూ అమెరికా సహా చాలా ప్రభుత్వాల నాయకులు ప్రజలను చంపాలంటూ పిలుపునిచ్చారు.
మాకు ఐక్యరాజ్యసమితి మినహాయింపు అనే నిబంధన ఉంది. ఒక ప్రభుత్వాన్ని ఐక్యరాజ్యసమితి గుర్తిస్తే మేము దాని ఎక్స్ ఖాతాలను ఎప్పటికీ సస్పెండ్ చేయం. అయితే హమాస్‌ను ఒక ప్రభుత్వంగా ఐక్యరాజ్యసమితిగా గుర్తించలేదు. అందుకే దాని ఖాతాలను సస్పెండ్ చేస్తున్నామని వివరణ ఇచ్చారు. అయితే దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఎలాన్ మస్క్.. వాక్‌స్వేచ్ఛ ఎక్కడ? వాక్ స్వేచ్ఛ ఎలా ఉండాలో? ఎవరికి ఉండాలో ఐక్యరాజ్యసమితి నిర్ణయిస్తుందా? అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.