ఎన్టీఆర్ పుట్టుకలో దోషం, ఎవ్వరికీ తెలియదు.. షాక్ ఇచ్చిన వేణుస్వామి
ఆ హీరో జాతకం ఇలా ఉంటుంది.. ఈ హీరోయిన్ భవిష్యత్తు అలా ఉంటుంది.. అంటూ సెలబ్రిటీస్ గురించి చెబుతూ తరచుగా వార్తల్లో నిలుస్తున్నాడు వేణు స్వామి. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టుకలో దోషం ఉందని చెప్పి షాక్ ఇచ్చాడు.
సోషల్ మీడియా పుణ్యమా అని.. ఫలానా, ఫలానా జాతకాలు అంటూ.. టాక్ ఆఫ్ ది టౌన్ అవుతునే ఉన్నాడు జ్యోతిష్యుడు వేణు స్వామి. ఎప్పుడు కూడా వివాదాస్పద వ్యాఖ్యలే చేస్తుంటాడు. సమంత, నాగచైతన్య విడాకులు.. నిహారిక కొణిదెల డివోర్స్ విషయాల్లో ముందే జాతకం చెప్పి సెన్సేషన్ అయ్యాడు. అలాగే స్టార్ హీరోయిన్ల ఇళ్లలో పూజలు చేస్తూ.. ఇంటర్య్వూల్లో ఏదో ఒక కాంట్రవర్శీలకు దారి తీస్తు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాడు.
మొన్నటికి మొన్న విజయ్ దేవర కొండ, రష్మిక పెళ్లి చేసుకుంటారు.. కానీ విడిపోతారు, రష్మిను పెళ్లి చేసుకోవద్దని చెప్పానని చెప్పాడు. అలాగే ప్రభాస్‌కు ఇక పై హిట్లు రావని కూడా చెప్పాడు. ఇక ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ మీద పడ్డాడు. గతంలో ఎన్టీఆర్‌కు రాజయోగం ఉందని చెప్పిన వేణు స్వామి.. ఇప్పుడు మాత్రం కాస్త ఫ్యాన్స్‌ని టెన్షన్ పెట్టే విషయాన్ని చెప్పుకొచ్చాడు. తిరుమల శ్రీవారి సన్నిధిలో తాను, ఎన్టీఆర్ వాళ్ళ అమ్మ గారు షాలిని కూర్చుని మాట్లాడుకున్నామంటూ.. ఓ షాకింగ్ సీక్రెట్ రివీల్ చేశాడు. అప్పటికే ఎన్టీఆర్ జాతకాన్ని నేను చాలా సార్లు చెప్పానని.. ఎన్టీఆర్ అమ్మతో చెప్పాను. అప్పుడు ఆమె నన్ను ఒక ప్రశ్న అడిగింది అన్నారు.
ఎన్టీఆర్ పుట్టుక విషయంలో ఒక పెద్ద సమస్య ఉందనే విషయం తెలియకుండానే.. ఎలా చెబుతున్నారు అని ఆమె ప్రశ్నించింది. తనకు ఆ సమస్య ఏంటో నాకు తెలుసు.. అని చెప్పడంతో ఆమె ఒక్కసారిగా షాక్ అయ్యారని అన్నాడు. అయితే.. ఆ దోషం గురించి కేవలం జూ. ఎన్టీఆర్, పెద్ద ఎన్టీఆర్‌తో పాటు నాకు మాత్రమే తెలుసు.. అలాంటిది మీకు ఎలా తెలుసు? అని ఆమె ఆశ్చర్యపోయింది. కానీ నాకు అన్ని విషయాలు తెలుసు.. అని ఆమె చెప్పినట్టుగా చెప్పుకొచ్చాడు. కానీ ఆ అసలు సమస్య ఏంటనే విషయం మాత్రం వేణు స్వామి చెప్పలేదు. మరి ఎన్టీఆర్‌కి ఉన్న ఆ దోషం ఏంటి? అంత సీక్రెట్‌గా ఎందుకు ఉంచారు? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మరి వేణు స్వామి దీని పై ఎప్పుడు క్లారిటీ ఇస్తాడో చూడాలి.