Hombale Films: హోంబలే ఫిల్మ్స్ మాస్టర్ ప్లాన్.. భలే వాడుకుంటున్నారుగా!
కెజియఫ్ సిరీస్‌తో ఒక్కసారిగా పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకుంది నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్. అక్కడి నుంచి కాంతారతో మరో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇక ఇప్పుడు సలార్‌తో మరో సంచలనానికి రెడీ అవుతున్నారు. దీంతో ప్రభాస్ క్రేజ్‌ను భలేగా వాడుకుంటున్నారు.
మామూలుగా అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఓ పాన్ ఇండియా సినిమా ప్రమోషన్లను పీక్స్‌లో చేస్తున్నారు మేకర్స్. కానీ సలార్ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ వారు మాత్రం.. ఆఫ్ లైన్ కంటే అన్లైన్లోనే ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు. ప్రభాస్ క్రేజ్ వల్ల హోంబలే వారికి ప్రమోషనల్ ఖర్చు తగ్గింది. ఇప్పటికే రిలీజ్ చేసిన రెండు ట్రైలర్స్‌తో సలార్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అందుకే.. ఒక్క ఈవెంట్ కూడా జరపకుండా ప్రమోషన్స్ చేస్తున్నారు. అయితే ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ సందేట్లో సడేమియా అన్నట్టుగా మిగతా సినిమాలను కూడా ప్రమోట్ చేస్తోంది హోంబలే ఫిల్మ్స్.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు సలార్ అప్డేట్స్ కోసం.. ట్విట్టర్లో హోంబలే ఫిల్మ్స్ అఫీషియల్ అకౌంట్‌ను చూస్తున్నారు. సలార్ నుంచి ఎలాంటి అప్డేట్ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. కానీ ఈ సమయంలో హోంబలే ఫిల్మ్స్ నుంచి మిగతా సినిమాల అప్డేట్స్ వస్తున్నాయి. సలార్ హైప్‌ని వాడుకుంటూ ఇతర సినిమాలని కూడా ప్రమోట్ చేస్తోంది హోంబలే. ఇటీవలే భగీర టీజర్‌ని రిలీజ్ చేసారు. ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ కథను అందిస్తున్నాడు.
పైగా ఆ రోజు హీరో శ్రీమురళి బర్త్ డే కాబట్టి.. భగీర టీజర్ వచ్చింది అనుకున్నారు. కానీ ఇప్పుడు.. ఉన్నట్టుండి కొత్తగా కీర్తి సురేష్ నటిస్తున్న’రఘు తాత’ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు. త్వరలోనే రఘు తాత రిలీజ్ అవ్వబోతుంది.. అంటూ హోంబలే ఫిల్మ్స్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది. దీంతో సలార్ కోసం ఎదురు చూస్తున్న వారు.. ఈ సినిమాల అప్టేట్స్ కూడా చూస్తున్నారు. ఏదేమైనా.. సలార్ క్రేజ్‌ను భలేగా వాడుకుంటోంది హోంబలే ఫిల్మ్స్.