»Rs 500 K Gas Cylinder Officials Preparing Guide Lines
Mahalakshmi Scheme: రూ. 500 కే గ్యాస్ సిలిండర్.. గైడ్ లైన్స్ సిద్ధం చేస్తున్న అధికారులు
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ. 500కే వంట గ్యాస్ ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీని ద్వారా ప్రభుత్వానికి ఎంత నష్టం రానుందో, ఎవరెవరికి ఇవ్వాలో సివిల్ సప్లై శాఖ అధికారులు గైడ్ లైన్స్ సిద్ధం చేస్తున్నారు.
Rs. 500 k gas cylinder.. Officials preparing guide lines
Mahalakshmi Scheme: మహాలక్ష్మి పథకం (Mahalakshmi Scheme) కింద మహిళలకు గ్యాస్ సిలిండర్(gas cylinder) ను రూ.500కు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. డిసెంబర్ 28 కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ పథకం అమలు చేసే యోచనలో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలను ప్రకటించింది. ప్రస్తుతం ఈ హామీని అమలు చేయాలని గవర్నమెంట్ భావిస్తోంది. ఇందులో భాగంగా సివిల్ సప్లై శాఖ అధికారులు గైడ్‌లైన్స్‌ను రూపొందిస్తున్నారు. రాష్ట్రంలో గ్యాస్ వినియోగదారుల సంఖ్య ఎంత, ఎవరెవరికి ఈ పథకం అమలు చేయాలని ఆలోచిస్తున్నారు.
అధికార లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రతి నెల 60 లక్షల సిలిండర్ల సరఫరా జరుగుతోంది. దీని ప్రకారం అందరికీ ఈ పథకం అమలు చేస్తే రాష్ట్ర ఖజానాపై ఏటా రూ.3 వేల కోట్ల భారం పడుతుంది, కేవలం మహిళల పేరుతో ఉన్న 70 లక్షలు కనెక్షన్లకు సరఫరా చేస్తే భారం తగ్గనుంది. అందుకనే మహిళల పేరుతో ఉన్న కనెక్షన్లకే సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. గ్యాస్ కనెక్షన్‌ను పేరు మార్చుకునే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.