»Former Minister Harish Rao Criticizes Congress At Brs Thanksgiving Meeting In Narsapur
Harishrao : ఓడిపోయామని కుంగిపోవద్దు.. అండగా ఉంటాం
మెదక్ జిల్లా నర్సాపూర్ లో బీఆర్ఎస్ కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీశ్‌రావు, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ వాళ్లు గ్లోబల్ ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు.
Harishrao : మెదక్ జిల్లా నర్సాపూర్ లో బీఆర్ఎస్ కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీశ్‌రావు, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ వాళ్లు గ్లోబల్ ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. నిజం గడప దాటకముందే అబద్ధాలు ఊరంతా తిరిగాయని విమర్శించారు. కేసీఆర్‌కు శ్రమ తప్ప ప్రతీకారం తెలియదని హరీశ్‌రావు అన్నారు. నిజంగా కేసీఆర్ కావాలనుకుంటే మన ప్రభుత్వం వచ్చాక సగం మంది కాంగ్రెస్ నేతలు జైల్లో ఉండేవారన్నారు. హౌసింగ్ స్కాములపై సీఐడీ విచారణ చేస్తే పెద్ద రిపోర్ట్ వచ్చింది.. ఒక్కో కాంగ్రెస్ నాయకుడు 50 ఇళ్ల బిల్లులు తిన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, ఇవాళ లోక్ సభలోకి ఇద్దరు చొరబాటుదారులు ప్రవేశించారు. అసెంబ్లీలో బాష్పవాయువు ప్రయోగించి భయాందోళనలు సృష్టించారు. కాగా, ఈ ఘటనపై హరీశ్‌రావు స్పందించారు. 2009లో పార్లమెంట్‌పై దాడి జరిగింది. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. అదృష్టవశాత్తూ ఎంపీలకు ఏమీ జరగలేదన్నారు. ఈ ఘటనపై విచారణ జరిపించాలని అన్నారు. మాటలు గొప్పగా ఉండకూడదు.. చేతలు కూడా గొప్పగా ఉండాలి. అంగరంగ వైభవంగా నిర్మించామని చెబుతున్న పార్లమెంట్ కు రక్షణ లేదని హరీశ్ రావు విమర్శించారు.