»Congress Leaders Jeevan Reddy Demand That Former Brs Mla Jeevan Reddy Should Pay Rs 8 Crores
Jeevan reddy: రూ.8 కోట్లు చెల్లిచాలని కాంగ్రెస్ నేతల డిమాండ్
ఆర్మూర్ మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అహంకారానికి కాంగ్రెస్ పార్టీ తగిన బుద్ది చెబుతుందని ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ క్రమంలో ఆర్టీసీకి బకాయిగా ఉన్న దాదాపు 8 కోట్ల రూపాయలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
Congress leaders jeevan reddy demand that former BRS MLA Jeevan Reddy should pay Rs 8 crores
ఆర్మూర్(armoor)లోని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఎ. జీవన్‌రెడ్డికి చెందిన జీవన్ మాల్‌ను లీజు సొమ్ము చెల్లించని కారణంగా సీజ్ చేసి విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ గురువారం ప్రకటించింది. అయితే జప్తుకు సంబంధించి పబ్లిక్ అడ్రస్ సిస్టమ్‌పై ఆర్టీసీ బృందం ఈ మేరకు ప్రకటన చేసింది. ఈ మాల్ ఆర్టీసీకి అక్టోబర్ వరకు రూ.7.23 కోట్లు బకాయిపడినట్లు వెల్లడించింది.
ఈ క్రమంలో విషయం తెలిసిన అక్కడి కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జీ(congress incharge) నేత ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి జీవన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే క్రమంలో ప్రభుత్వానికి అప్పుడు ఉండకూడదని జీవన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీకి ఉన్న బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆర్టీ మాల్ ను కాంగ్రెస్ ప్రభుత్వం సీజ్ చేస్తుందని వినయ్ రెడ్డి అన్నారు. ఇలాంటి వ్యక్తికి ఆర్మూర్ ప్రజలు ఎన్నికల్లో సరిగ్గా బుద్ది చెప్పారని అన్నారు. అంతేకాదు కబ్జాకోరు, బెదిరింపులకు పాల్పడే వ్యక్తులను ప్రజలు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారని కాంగ్రెస్ నేత అన్నారు.
విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్మూర్ బస్టాండ్‌లోని ఒక బహిరంగ ప్రదేశంలో బిల్డ్ ఆపరేట్-ట్రాన్స్ఫర్ మోడ్‌లో జీవన్ మాల్‌ను నిర్మించింది. మాల్‌కు జీవన్‌రెడ్డి తన పేరు పెట్టి ఆ భవనంలో మల్టీప్లెక్స్, షాపింగ్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేశారు. అయితే లీజు చెల్లించాలని ఆర్టీసీ(TSRTC) సంస్థ ఇప్పటికే నోటీసులు జారీ చేసిందని తెలుపగా..వాటిని నిర్వాహకులు డిఫాల్ట్ చేశారని చెప్పారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల తర్వాత బిఆర్ఎస్ ప్రభుత్వం కార్యాలయం నుంచి వైదొలగడంతో ఆర్టీసీ అధికారులు డిఫాల్ట్ లీజు మొత్తాల సేకరణను వేగవంతం చేశారు. అయితే లీజు ఛార్జీల వసూళ్లను ఆర్టీసీ ప్రధాన కార్యాలయం నిర్వహిస్తోందని టీఎస్ఆర్టీసీ నిజామాబాద్ రీజనల్ మేనేజర్ జాన్ రెడ్డి చెప్పారు. అద్దెదారులు మూడు రోజుల్లో మొత్తం చెల్లించకపోతే, ఏడు రోజుల నోటీసు వ్యవధి ముగిసినట్లయితే, జీవన్ మాల్‌ను సీజ్ చేస్తామని ప్రకటించారు.