Balakrishna: తెలంగాణ రెండో ముఖ్యమంత్రి పదవీ రేవంత్ రెడ్డి చేపట్టబోతున్నారు. సీఎల్పీ నేతగా కాంగ్రెస్ హైకమాండ్ ఆయనను నియమించింది. దీంతో అభిమానులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఏపీ టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ (Balakrishna) కూడా విష్ చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండో సీఎంగా బాధ్యతలు చేపడుతున్న రేవంత్ రెడ్డికి (Revanth Reddy) శుభాకాంక్షలు.. ప్రజాసేవ పరమావధిగా భావించే రేవంత్ క్రమ క్రమంగా ఎదిగారు. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి ఆకాంక్షను నెరవేర్చాలని కోరుతున్నాను. అన్ని రంగాల్లో తెలంగాణ ముందుకెళ్లాలని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.
సీఎంగా మీ మార్కు పాలనతో తెలంగాణ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేయాలని ఆకాంక్షిస్తూ బాలకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ టీడీపీలో ఉన్న సమయంలో బాలకృష్ణకు పరిచయం.. ఆ చనువుతో వెంటనే విష్ చేశారు. ఆ తర్వాత కూడా తరచూ మాట్లాడుకునే వారు.. పార్టీలు మారినా.. ఆ బంధం మాత్రం కంటిన్యూ అయ్యింది.
సీఎం పదవీ చేపట్టే రేవంత్ రెడ్డికి పలువురు అభినందనలు చెబుతున్నారు. కంగ్రాట్స్ రేవంత్ అంటున్నారు. హైకమాండ్ పిలుపుతో రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. అక్కడ కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని కలుస్తారు. ప్రమాణ స్వీకారానికి రావాలని సోనియా, రాహుల్‌ను కోరతారు.