ఇప్పటికే కాలుష్య కోరల్లో చిక్కుకున్న దేశరాజధాని ఢిల్లీని (New Delhi) దీపావళి (Diwali) వేడుకలు ఢిల్లీని మరింత కష్టాల్లోకి నెట్టాయి. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. తేలికపాటి వర్షంతో నగరంలో పరిస్థితి కాస్త మెరుగుపడిన విషయం తెలిసిందే. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలను లెక్కచేయకుండా చేసి ఢిల్లీ వాసులు టపాసులు పేల్చడంతో రాజధాని ప్రాంతంలో మరోసారి దట్టమైన పొగ అలుముకుంది. దీంతో ఏక్యూఐ (AQI) అత్యంత ప్రమాదకర స్థాయికి పెరిగింది. ఆదివారం రాత్రి ఏకంగా 680కి పెరిగినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా, దీపావళి ఎఫెక్ట్‌తో దేశంలోని మరో రెండు నగరాలు కూడా ఢిల్లీ సరసన చేరాయి. దీంతో సోమవారం ఉదయం రాజధాని, దాని పరిసర ప్రాంతాలను కాలుష్య పొగ కమ్మేసింది. చాలాచోట్ల అర్ధరాత్రి వరకు టపాసుల మోత మోగింది. దీంతో సోమవారం ఉదయానికి ఢిల్లీలో గాలి నాణ్యత మళ్లీ క్షీణించింది.
పలు ప్రాంతాల్లో విషపూరిత పొగమంచు కమ్మేయడంతో వాహనదారులకు మళ్లీ ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. దీంతో సోమవారం ఉదయం రాజధాని, దాని పరిసర ప్రాంతాలను కాలుష్య పొగ కమ్మేసింది. చాలాచోట్ల అర్ధరాత్రి వరకు టపాసుల మోత మోగింది. దీంతో సోమవారం ఉదయానికి ఢిల్లీలో గాలి నాణ్యత మళ్లీ క్షీణించింది. పలు ప్రాంతాల్లో విషపూరిత పొగమంచు కమ్మేయడంతో వాహనదారులకు మళ్లీ ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. ప్రపంచంలోనే 10 అత్యంత కాలుష్య నగరాల జాబితాను (World Most Polluted Cities) స్విస్ గ్రూప్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ( Swiss group IQAir) తాజాగా విడుదల చేసింది. ఆ జాబితా ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో దేశరాజధాని ఢిల్లీ అగ్రస్థానంలో నిలిచింది. ఇక మరో రెండు భారతీయ నగరాలు కూడా టాప్ 10లో నిలిచాయి. దీపావళి కారణంగా పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతా (Kolkata), మహారాష్ట్ర రాజధాని ముంబై (Mumbai) నగరాలు కూడా తీవ్ర వాయుకాలుష్యంలో చిక్కుకున్నాయి.