Kidnapped and covered with a scarf.. Complaint to the police
Kidnap: తెలంగాణ గట్టు మీద రాజకీయాలు వేడెక్కాయి. ప్రచారంలో నేతలు బిజీగా ఉన్నారు. ఇప్పటికీ కొందరు పార్టీ మారుతున్నారు. ఇక గ్రామస్థాయిలో చేరికలు కంటిన్యూ అవుతున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లాలో వింత ఘటన జరిగింది. ఓ కార్యకర్తను ఎత్తుకెళ్లి మరి కండువా కప్పించారు. తనకు ఇష్టం లేకున్నా పార్టీ మారాలని కోరారని.. బలవంతంగా కండువా కప్పారని అంటున్నారు.
ఏం జరిగిందంటే..?
వెంటకపూర్ గ్రామానికి చెందిన యాదగిరిని (yadagiri) వ్యవసాయ కమిటీ మాజీ చైర్మన్ దొడ్ల ఈశ్వర్ రెడ్డి, సుబ్బారెడ్డి కలిశారు. ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డిని కలిసి వద్దాం అని చెప్పారు. అలా అబద్దం చెప్పి.. నేరుగా రేవంత్ రెడ్డి వద్దకు తీసుకెళ్లారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పించి, పార్టీలో చేరినట్టు ప్రకటించారు.
తనను బలవంతంగా పార్టీలో చేర్పించారని యాదగిరి మండిపడ్డారు. రేవంత్ వద్దకు తనను తీసుకెళ్లిన దొడ్ల ఈశ్వర్ రెడ్డి, సుబ్బారెడ్డి మీద కేసు నమోదు చేశాడు. పార్టీలో తనను బలవంతంగా చేర్పించారని అంటున్నాడు. తనను చేర్పించిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించాడు. ఈ అంశంపై ఊరిలో ఒక్కటే చర్చ.. యాదగిరి మాత్రం తాను బీఆర్ఎస్ పార్టీకే పనిచేస్తానని అంటున్నారు.