Delhi Pollution: ఢిల్లీలో అదుపులోకి రాని పరిస్థితి.. సమావేశం క్యాన్సిల్ చేసిన ప్రభుత్వం
ఢిల్లీలోని ఏక్యూఐ సోమవారం వరుసగా ఐదో రోజు 'తీవ్ర' కేటగిరీలో నమోదైంది. ఈ మేరకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వెల్లడించింది. నేడు రాజధానిలో AQI 488గా ఉంది, ఇది చాలా హానికరం.
Delhi Pollution: ఢిల్లీలోని ఏక్యూఐ సోమవారం వరుసగా ఐదో రోజు ‘తీవ్ర’ కేటగిరీలో నమోదైంది. ఈ మేరకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వెల్లడించింది. నేడు రాజధానిలో AQI 488గా ఉంది, ఇది చాలా హానికరం. కాలుష్యం పెరుగుతున్న దృష్ట్యా ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ సోమవారం అన్ని సంబంధిత శాఖల సమావేశాన్ని పిలిచారు. ఇందులో కాలుష్యానికి సంబంధించి అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు.
#WATCH | Delhi: The air quality in Delhi is in the ‘Severe’ category as per the Central Pollution Control Board.
అంతకుముందు ఆదివారం ఢిల్లీ NCR లో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) నాల్గవ దశ పరిమితులు అమలు చేయబడ్డాయి. 8 పాయింట్ల యాక్షన్ ప్లాన్ ప్రకారం ఢిల్లీలో ట్రక్కుల ప్రవేశాన్ని నిషేధించారు. అయితే, ఈ నియమం అవసరమైన వస్తువులు, సేవలను అందించే ట్రక్కులకు, CNG, LNG, ఎలక్ట్రిక్ ట్రక్కులకు వర్తించదు. అదనంగా, ఢిల్లీలో నమోదైన డీజిల్‌తో నడిచే మీడియం గూడ్స్ వెహికల్స్ (MGVలు), హెవీ గూడ్స్ వాహనాలు (HGVలు) ఢిల్లీలో నడపకుండా నిషేధించబడ్డాయి. వైద్యుల అభిప్రాయం ప్రకారం ఆరోగ్యవంతమైన శరీరానికి 50 కంటే తక్కువ AQI మంచిది. అయితే ఢిల్లీలో నిరంతరంగా 450 AQI ఉండటం ప్రభుత్వానికే కాకుండా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులకు కూడా ఆందోళన కలిగిస్తుంది. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడేవారు ఈ సమయంలో బయటకు వెళ్లకూడదని, బయటకు వెళ్లినా మంచి మాస్క్ ధరించాలని వైద్యులు చెబుతున్నారు.
#WATCH | Delhi: The Air Quality Index (AQI) remains in the ‘Severe’ category in the national capital as per the Central Pollution Control Board (CPCB).