ప్రస్తుతం చియాన్ విక్రమ్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో 'తంగలాన్' అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా కెజియఫ్‌లో జరిగిన కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ లాక్ చేశారు మేకర్స్.
Vikram: ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో.. క్యారెక్టర్ కోసం ఎంత రిస్క్ అయిన సరే.. సై అని చెప్పడంలో చియాన్ విక్రమ్ ముందు వరుసలో ఉంటారు. పాత్ర ఏదైనా సరే.. విక్రమ్ మేకోవర్ చూస్తే భయపడాల్సిందే. ఎంత సేపైనా, ఎంత రిస్క్ అయినా.. విక్రమ్ ఈ విషయంలో తగ్గడు. అప్ కమింగ్ ఫిల్మ్లోను విక్రమ్ లుక్ చూస్తే ఔరా అనాల్సిందే. పా రంజిత్ దర్శకత్వంలో ‘తంగలాన్’ అనే సినిమా చేస్తున్నాడు విక్రమ్. ఆ మధ్య విక్రమ్ బర్త్ డే సందర్భంగా ‘తంగలన్’ మేకింగ్ వీడియోను రిలీజ్ చేయగా.. ఆ వీడియోలో విక్రమ్ మేకోవర్ చూసి అంతా షాక్ అయ్యారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను లాక్ చేశారు.
వచ్చే ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ‘తంగలాన్’ను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అలాగే నవంబర్ 1న టీజర్ రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఈ పోస్టర్లో విక్రమ్‌ను చూస్తే అస్సలు గుర్తు పట్టలేరు. ఓల్డ్ గెటప్‌లో ఉన్న పోస్టర్ షాక్ ఇచ్చేలా ఉంది. దీంతో తంగలాన్ పై అంచనాలు పెరిగిపోతున్నాయి. టీజర్ రిలీజ్ చేసిన తర్వాత సినిమాపై మరింత హైప్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక భారీ పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాను కేజీయఫ్ గనుల్లో జరిగిన కొన్ని నిజ ఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఇది ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజియఫ్కి పూర్తి భిన్నమైన కథాంశంతో రూపొందుతోంది. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మాళవిక మోహనన్ హీరోయిన్గా నటిస్తోంది.