విరాట్ కర్ణని హీరోగా పరిచయం చేస్తూ, క్లాస్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ఊరమాస్ సినిమా పెద కాపు(peddha kapu part 1). ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్టు ముందే ప్రకటించారు. తాజాగా పెదకాపు పార్ట్ వన్ ఓటిటిలోకి వచ్చేసింది.
‘కొత్త బంగారు లోకం’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న శ్రీకాంత్ అడ్డాల..ఆ తర్వాత ‘సీతమ్మ వాకిట్లో’ సిరిమల్లె చెట్టు అంటూ.. మహేష్ బాబు, వెంకటేష్‌లతో కలిసి మల్టీస్టారర్ మూవీ చేశాడు. ఆ తర్వాత మెగా హీరోని గ్రాండ్‌గా లాంచ్ చేశాడు. మెగా బ్రదర్ నాగబాబు కొడుకు వరుణ్ తేజ్‌ని ‘ముకుంద’ సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ చేశాడు. కానీ సినిమా రిజల్ట్ కాస్త తేడా కొట్టింది. ఇక ఆ తర్వాత మహేష్ బాబు మరో ఛాన్స్ ఇచ్చిన కూడా.. ‘బ్రహ్మోత్సవం’ సినిమాతో డిజాస్టర్ ఇచ్చాడు. అప్పటి నుంచి శ్రీకాంత్ అడ్డాల మళ్లీ కోలుకోలేదు. అయితే వెంకటేష్‌తో కలిసి తమిళ్ ‘అసురన్’ మూవీని తెలుగులో ‘నారప్ప’గా రీమేక్ చేశాడు. కానీ ఈ సినిమా ఓటిటికే పరిమితమైంది.
ఇక రీసెంట్గా వచ్చిన పెదాకాపు కూడా సోసోగానే నిలిచింది. విరాట్ కర్ణ, ప్రగతి శ్రీవాస్తవ జంటగా నటించిన ఈ పెదకాపు పార్ట్ 1(peddha kapu part 1) సెప్టెంబర్ 29న స్కంద సినిమాకు పోటీగా థియేటర్లోకి వచ్చింది. అయితే నెల రోజులు తిరగకుండానే ఓటిటి(OTT)లోకి వచ్చేసింది ఈ సినిమా. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది.శుక్రవారం అంటే, అక్టోబర్ 27 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది పెదకాపు. ఇక ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మించాడు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించాడు. రావు రమేష్, రాజీవ్ కనకాల, అనసూయ భరద్వాజ్ ముఖ్య పాత్రలు పోషించారు. అలాగే..డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాలో విలన్‌గా నటించాడు. కానీ ఈ సినిమా మిక్స్డ్ టాక్‌తోనే సరిపెట్టుకుని..ఫ్లాప్ ను మూటకట్టుకుంది.