BJP MP: ‘విశాఖను ఇప్పట్లో రాజధానిగా ప్రకటించే అవకాశం లేదని’ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళంలో పార్టీ నాయకులతో మాట్లాడిన అతను.. రాజధాని విషయంపై స్పందించారు. విశాఖ రాజధాని అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని, ఇప్పట్లో రాజధానిగా ప్రకటించే అవకాశం లేదని తెలిపారు. కోర్టు తీర్పు ఆధారంగా రాజధాని అంశంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కోర్టు తీర్పు రాకుండా నిర్ణయం ఎలా తీసుకుంటారు. కోర్టు తీర్పు కంటే ముందుగానే సీఎం వచ్చి కూర్చుంటారంటే ఎవరూ అభ్యంతరం చెప్పబోరన్నారు. ఇంతకు ముందు పాలకుల నిర్లక్ష్యం వల్ల ఉత్తరాంధ్ర చాలా వెనుకబడిందని జీవీఎల్ ఆరోపించారు.
ఉత్తరాంధ్రను అభివద్ధి చేయాలనే దిశగా డిసెంబర్లో రాజధానిని విశాఖకు మారుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే విశాఖలో భవనాల నిర్మాణం కూడా ముమ్మురంగా జరుగుతోందని అభిప్రాయ పడుతున్నారు. డిసెంబర్ 21న జగన్ పుట్టినరోజు కావడంతో.. ఆసమయంలో విశాఖకు రాజధాని మారనుందని వార్తలు వినిపించాయి. కానీ ప్రస్తుతం బీజేపీ ఎంపీ వ్యాఖ్యలతో విశాఖకు రాజధాని ఎప్పుడు వస్తుందనే దాని మీద సందేహాలు మొదలయ్యాయి. ఈ విషయంపై స్పష్టత రావాలంటే మరికొన్నిరోజులు ఆగాల్సిందే.