టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) ఢిల్లీ నుంచి గన్నవరం చేరుకున్నారు. హస్తిన పర్యటన ముగించుకుని హుటాహుటిన విజయవాడ(Vijayawada)కు వచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, పెద్ద సంఖ్యలో టీడీపీ (TDP) నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి లోకేశ్ నేరుగా రాజమండ్రికి బయల్దేరారు. మరోవైపు చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఆయన 5 కిలోల బరువు తగ్గారని ఆయన భార్య నారా భువనేశ్వరి (Bhuvaneshwari) ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబుకు స్టెరాయిడ్స్(Steroids) ఇచ్చి ఆయన ఆరోగ్యాన్ని దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయని అచ్చెన్నాయుడు ఆరోపించారు.
తన తండ్రి ఆరోగ్యం నేపథ్యంలోనే లోకేశ్ ఢిల్లీ (Delhi) నుంచి హుటాహుటిన వచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు రాజమండ్రిలోని క్యాంప్ ఆఫీసులో టీడీపీ కీలక నేతలతో లోకేశ్ భేటీ అవనున్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. మరోవైపు ఇవాళ కుటుంబ సభ్యులతో కలిసి ఆయన చంద్రబాబు(Chandrababu)తో ములాఖత్ కానున్నట్లు తెలుస్తోంది.చంద్రబాబు ఆరోగ్యంపై లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘భద్రతలేని జైలులో చంద్రబాబు ఆరోగ్యం (Health) క్షీణించేలా చేసి ఆయనకి ప్రాణహాని తలపెడుతున్నారు. ఎన్నడూ ఏ తప్పూ చేయని 73 ఏళ్ల చంద్రబాబు పట్ల రాక్షసంగా వ్యవహరిస్తోంది ఈ ప్రభుత్వం.
వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ, జ్యుడీషియల్ (Judicial) రిమాండ్లో ఉంచుతూనే చంద్రబాబుని అనారోగ్య కారణాలతో అంతమొందించే ప్రణాళిక ఏదో రచిస్తున్నారు. ఆయన ఆరోగ్యంపై జైలు అధికారుల తీరు సందేహాస్పదంగా ఉంది. జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న చంద్రబాబుని ముద్దాయి అని హెల్త్ బులెటిన్లో పదే పదే పేర్కొనేందుకు పెట్టిన శ్రద్ధ ఆయన ఆరోగ్యం, భద్రత (Security)పై పెట్టడంలేదు. ఆయనకి ఏ హాని జరిగినా, సైకోజగన్ సర్కారు, జైలు అధికారులదే బాధ్యత’ అంటూ లోకేష్ ట్వీట్ చేశారు