Donald Trump: డోనాల్డ్ ట్రంప్‌కు ఉండే అతిపెద్ద భయం ఏంటో తెలుసా?
సాధారణంగా ఎవరైనా జంతువులకు, దెయ్యాలకు, మనుషులకు భయపడుతుంటారు. కానీ అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌నకు భోజనం చేయడమంటే చాలా భయమట. అయితే అసలు ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.
జంతువులకు, దెయ్యాలకు భయపడని వాళ్లు చిన్న విషయాలకు భయపడుతుంటారు. అందులోనూ సెలబ్రిటీలు, పొలిటిషియన్లు అయితే ప్రతి విషయంలో జాగ్రత్త వహిస్తారు. ఎవరైనా ఏదో విధంగా ఎటాక్ చేస్తారేమో అనే భయం వీళ్లలో ఎక్కువగా ఉంటుంది. అయితే అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌నకు కూడా ఇలాంటి చిన్న భయమే ఒకటి ఉంది. అదెంటంటే?
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌నకు ఆహారం విషయంలో ఎక్కువగా భయపడుతుంటారు. ట్రంప్ ఎల్లప్పుడూ ప్రాణభయంతో ఉండేవారని వైట్ హౌస్ మాజీ ఉద్యోగి కాసిడి హచిన్సన్ ఆసక్తికర విషయాలు తెలిపింది. ట్రంప్ మీద ఎవరైనా విష ప్రయోగం చేస్తారమోనని భయంతో ఎక్కడైనా భోజనం చేయడానికి ఆలోచిస్తారట. ఒక్కమాటలో చెప్పాలంటే డొనాల్డ్ ట్రంప్‌కు భోజనం చేయడమే అతిపెద్ద భయమని హచిన్సన్ తెలిపారు.
ఆహారంలో విషం కలిపి ఎవరైనా తనను చంపే ప్రయత్నం చేస్తారమోనని భయం ట్రంప్‌లో ఎక్కువగా ఉండేదని హచిన్సన్ తాజాగా ఓ ఇంటర్వూలో తెలిపింది. అందుకే ట్రంప్ ఎల్లప్పుడు కెచప్ బాటిల్‌ను తన వెంట తీసుకువెళ్తారని హచిన్సన్ చెప్పారు. అలాగే ట్రంప్ తినే ఆహారాన్ని ఓసారి గదిలో విసిరారని కూడా కాసిడి హచిన్సన్ ట్రంప్ గురించి తెలిపారు. కాచిన్సన్ ఇటీవల ‘ఇనఫ్’ అనే పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఇంటర్వూ ఇస్తూ..అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
ఇది కూడా చూడండి:Nobel Peace Prize 2023: గెల్చుకున్న ఇరాన్ కార్యకర్త నర్గేస్