»Total Energies Se Clean Energy Projects 300 Million Investment
Adani: వ్యాపార రంగంలో దూసుకుపోతున్న అదానీ.. అండగా నిలిచిన ఫ్రెంచ్ కంపెనీ
ఫ్రెంచ్ ఎనర్జీ కంపెనీ టోటల్ ఎనర్జీస్ అదానీ గ్రూప్‌లో పెట్టుబడి పెట్టింది. ఇది అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ కి చెందిన క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్‌లలో 300 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది.
Adani: ఫ్రెంచ్ ఎనర్జీ కంపెనీ టోటల్ ఎనర్జీస్ అదానీ గ్రూప్‌లో పెట్టుబడి పెట్టింది. ఇది అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ కి చెందిన క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్‌లలో 300 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది. దీంతో క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో గ్లోబల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులు పెరిగాయి. ఇప్పుడు అదానీ ఈ ప్రాజెక్టులలో ప్రపంచ పెట్టుబడిదారుల మొత్తం పెట్టుబడి 1.63 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఇది భారతీయ కరెన్సీలో సుమారు రూ. 14,000 కోట్లకు సమానం.
కొత్త జాయింట్ వెంచర్ సంస్థలో దాని వాటా దాదాపు 50 శాతం ఉంటుందని, మిగిలిన వాటా అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌తో ఉంటుందని సమాచారం. జాయింట్ వెంచర్ 1,050 మెగావాట్ల పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంటుంది. అందులో 300 మెగావాట్లు ఇప్పటికే కార్యాచరణ సామర్థ్యం కలిగి ఉంది. అదే సమయంలో 500 మెగావాట్ల సామర్థ్యంతో ప్లాంట్‌ను నిర్మిస్తున్నారు. దీంతో పాటు 250 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన ఇంధన ప్రాజెక్టుల పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. 250 మెగావాట్ల సామర్థ్యం గల ఇంధన ప్రాజెక్టులలో సౌర, పవన శక్తి రెండూ ఉన్నాయి.
అదానీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్‌లో టోటల్ ఇప్పటికే 19.7 శాతం వాటాను కలిగి ఉన్నారు. AGEL కాకుండా, దీనికి మరొక జాయింట్ వెంచర్ కూడా ఉంది, దీని పేరు 23L. దీని పోర్ట్‌ఫోలియో 2,353 మెగావాట్లు. AGEN అదానీ పోర్ట్‌ఫోలియోలోని ఒక సంస్థ, ఇది గత కొన్ని నెలల్లో చాలా మంది పెట్టుబడిదారులను ఆకర్షించింది. వీటిలో టోటల్, GQG క్యాపిటల్ పార్ట్నర్స్, ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ కూడా ఉన్నాయి. అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత ఆకర్షణీయమైన మదింపులను సద్వినియోగం చేసుకుని ఈ ముగ్గురు ఇన్వెస్టర్లు గత కొన్ని నెలల్లో 1.63 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టారని, ఇది దాదాపు రూ. 14,000 కోట్లకు సమానమని నిపుణుల వర్గాలు చెబుతున్నాయి. అయితే, అదానీ గ్రూప్ హిండెన్‌బర్గ్ నివేదికలో చేసిన ఆరోపణలన్నీ అబద్ధమని పేర్కొంది. GQG భాగస్వాములు AGELలో 6.8 శాతం వాటాను కలిగి ఉన్నారు. QIAకి 2.7 శాతం వాటా ఉంది. అదేవిధంగా IHC ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీకి 1.3 శాతం వాటా ఉంది.