»Explanation Of The Seattle Police Who Laughed At Jahnavis Death In America
USA: జాహ్నవి మృతిపై ఎగతాళిగా నవ్విన పోలీసు వివరణ
జాహ్నవి కందుల మృతిని హేళన చేస్తూ సియోటెల్ పోలీసు నవ్విన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అమెరికా, భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వీడియోపై సదరు పోలీసు ఆఫీసర్ వివరణ ఇచ్చారు.
Explanation of the Seattle police who laughed at Jahnavi's death in America
USA: పై చదువుల కోసం అమెరికా వెళ్లిన తెలుగు విద్యార్థిని జాహ్నవి (Jaahnavi Kandula) అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఘటనపై అక్కడి పోలీసు అధికారి చులకనగా మాట్లాడడం తీవ్ర విమర్శలకు దారితీసింది. దీంతో భారత్ ఒక్కసారిగా భగ్గుమంది. ఆ ఆఫీసర్‌పై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వివాదంపై సదరు ఆఫీసర్ స్పందించారు. ఆ వ్యాఖ్యలు జాహ్నవిని ఉద్దేశించి చేసినవి కావని చెప్పారు. ఈ వివాదానికి కారణమైన అధికారికి సియాటెల్ పోలీసు (Seattle Police) విభాగం మద్దతుగా నిలిచింది.
ఆంధ్రప్రదేశ్‌లో గల కర్నూలు జిల్లాకు చెందిన కందుల జాహ్నవి (23) ఈ ఏడాది జనవరిలో సియాటెల్‌లోని పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొని మృతిచెందింది. ఈ కేసు దర్యాప్తు గురించి పోలీసు అధికారి డేనియల్ అడెరెర్ చులకనగా మాట్లాడుతూ పగలబడి నవ్విన వీడియో ఆన్లైన్లో వైరల్ అయ్యింది. అందులో ఆ అధికారి మాట్లాడుతూ.. ఆమె ఓ సాధారణ వ్యక్తి.. మరణానికి విలువలేదని అన్న మాటలు తీవ్ర దుమారాన్ని రేపాయి. పోలీసు అధికారి డేనియల్‌పై ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ వివాదంపై సియాటెల్ పోలీసు అధికారుల ఓ ప్రకటన విడుదల చేసింది. వైరల్ అయిన దృశ్యాలు బాడీక్యామ్ వీడియో రికార్డ్ చేసినవి అని పూర్తి వివరాలు తెలియకపోవడంతో అక్కడ అసలేం జరిగిందో చెప్పడంలో మీడియా విఫలమైంది అంటూ డేనియల్‌కు మద్దతుగా గిల్డ్ వ్యాఖ్యానించింది. అలాగే ఈ ఘటనపై ఉన్నతాధికారులకు డేనియల్ రాసిన లేఖను కూడా గిల్డ్ విడుదల చేసింది. ఇందులో న్యాయవాదులను ఉద్దేశిస్తూ ఆ వ్యాఖ్యలు చేసినట్లు డేనియల్ తన లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు న్యాయస్థానంలో వాదనలు ఎంత హాస్యాస్పదంగా ఉంటాయో గుర్తొచ్చి తాను నవ్వానని పేర్కొన్నారు.
ప్రమాదం జరిగిన చోటు నుంచి ఇంటికి తిరుగి వస్తూ తన మిత్రుడైన మరో పోలీసుతో ఫోన్లో మాట్లాడానని వివరించాడు. ఆ సమయంలో తన డ్యూటీ కూడా అయిపోయిందన్ని చెప్పారు. ఇక వారు మాట్లేడి బాడీక్యామ్ లో రికార్డు అయిన విషయం తనకు తెలియదని వివరించాడు. ఇలాంటి మరణాల విషయంలో లాయర్లు ఎలా సెటిల్ చేస్తారో తాను ఇది వరకే చాలా కేసులు చూసి అదే విషయాన్ని తన స్నేహితుడితో చెప్పానాని.. జాహ్నవి మృతి గురించి చులకనగా మాట్లాడలేదని పేర్కొన్నారు. ఈ ఘటన నెట్టింట్లో ప్రచారం కావడంతో ఆ పోలీసును విధుల నుంచి తొలగించాలని సియాటెల్ పోలీసులకు ఆన్లైన్లో అనేక అభ్యర్థనలు వచ్చాయి.