ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర బాబు నాయుడును అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అరెస్టు చేసి వెంటనే జైలుకు పంపించేశారు. జైలుకు పంపిన తీరు తెలుగు ప్రజలను షాక్‌నకు గురి చేసింది.సీఎం జగన్ మోహన్ రెడ్డి నియంతృత్వ పోకడలపై ప్రజలు నిప్పులు చెరుగుతున్నారు. చంద్ర బాబుపై వ్యక్తిగత కక్ష సాధింపుల కోసం అరెస్టు చేశారనే వాదనలు వినపడుతున్నాయి. మరో ప్రచారం ఊపందుకుంది. ఈ వ్యవహారం వెనక ప్రధాని మోదీ ఉన్నారనే మాటలు వినపడుతున్నాయి. చంద్రబాబును అణిచివేయడానికి ప్రధాని మోడీయే సీక్రెట్ ఎజెండా అని చాలా మంది భావిస్తున్నారు.
ప్రధాని మోడీ తన శత్రువులను మరచిపోరని లేదా క్షమించరని అంటూ ఉంటారు. ఎన్నికలకు ముందు నాలుగేళ్లకు పైగా మోడీతో భుజాలు తడుముకుని చివరి నిమిషంలో APలో కూటమిని విచ్ఛిన్నం చేయడమే కాకుండా ఆగ్రహానికి గురయ్యారు. మోడీ అతనిని క్షమించి ఉండేవాడు కానీ CBN మోడీని ఫౌల్-నోట్ చేసి దేశవ్యాప్తంగా అతనికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు.
చంద్ర బాబు నాయుడు అరెస్టుపై బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మౌనం పాటిస్తోంది. చంద్ర బాబును మట్టికరిపించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ శూన్యతను సృష్టించి, ఆ శూన్యతను నింపాలని రకరకాల వరాలు కురిపిస్తూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తాము సత్తా చాటేందుకు టీడీపీ లేకుండా చేయాలనే ప్లాన్ లో భాగంగా ఇలా చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి, ఈ విషయంలో మోడీ ఎప్పుడు రెస్పాండ్ అవుతారో మరీ.