ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు, ట్విటర్ (Twitter) (ఎక్స్), టెస్లా ,స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్(Elon Musk) ద్వారా రహస్యంగా కవలలకు జన్మనిచ్చిన ఒక మహిళ సడన్ గా వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ మహిళ పేరు ఏమిటి.. ప్రత్యేకత లేమిటి.. ప్రపంచ కుబేరుడిని ఆకర్షించగలిగిన స్పెషల్ క్వాలిటీ(Special quality)స్ ఏమిటి అనేది ఆన్ లైన్ వేదికగా చర్చనీయాంశం అయ్యింది. ఆయన ఎక్స్ పార్ట్ నర్ గ్రిమ్స్ తమకు మూడో సంతానం సంతానం ఉన్నట్టు వెల్లడించారు. వాస్తవానికి వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు మాత్రమే ఉన్నట్టు ఇప్పటి వరకు ప్రపంచానికి తెలుసు. తాజాగా తమ మూడో సీక్రెట్ సంతానం గురించి ఇప్పుడు వెల్లడించారు.
ది న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం ఎలాన్ మస్క్ బయోగ్రఫీ (Biography) ఈ నెల 12న విడుదల కాబోతోంది. ఇందులో మస్క్, గ్రిమ్స్ వారి మూడో సంతానాన్ని చూపెట్టారు. మూడో సంతానమైన కొడుకు పేరు టెక్నో మెకానికస్ (Techno Mechanicus) అని చెప్పారు. అయితే అతని గురించి అంతకు మించి వివరాలు తెలియలేదు. ఎప్పుడు పుట్టాడు? తదితర వివరాలు ఎవరికీ తెలియదు. ముగ్గురు మహిళలో మస్క్ కు 10 మంది పిల్లలు ఉన్నారు. మస్క్ బయోగ్రఫీ పుస్తక రచయిత వాల్టర్ ఐజాక్సన్… టెక్సాస్ లోని ఆస్టిన్
(Austin) లోని జిలిస్ నివాసంలో కవల పిల్లల ఫోటోలను షేర్ చేసింది.
అవును..అప్పట్లో కవల పిల్లలతో మస్క్, జిలిస్ ఫోటోలను వాల్టర్ షేర్ చేయడం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. అయితే మస్క్ – జిలిస్ జంట ఈ పిల్లలను ఐవీఎఫ్ (IVF) ద్వారా 2021 నవంబర్ లో జన్మనిచ్చింది. స్టీవ్ జాబ్స్, ఆల్బర్ట్ ఐన్ స్టీన్ (Einstein)వంటి వ్యక్తుల నుంచి ప్రశంసలు పొందిన జీవిత చరిత్రల రచయిత ఐజాక్సన్ మస్క్ బయోగ్రఫీ రాస్తున్న సంగతి తెలిసిందే. ఈమె రాసిన మస్క్ బయోగ్రఫీ సెప్టెంబరు 12న రిలీజ్ కానుంది. అయితే ఇప్పటికే ఆయన రాసిన బయోగ్రఫీలు అత్యధికంగా అమ్ముడయిన నేపథ్యంలో.. మస్క్ బయోగ్రఫీ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేయనుందనేది ఆసక్తిగా మారింది.